శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ద్వేయంగా పనిచేస్తున్నామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి తండా లో బుధవారం రోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పర్యటించారు.ఈ మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలఙ అడిగి తెలుసుకున్నారు. కాగా గోపనపల్లి తండా లో నెలకొన్న కరెంటు సమస్యలను వల్ల ఇబ్బందులు పడు తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్థంబాల బదిలీ, కొత్త స్థంబాల ఏర్పాటు, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ ద్వీపాల వంటి పనులు చేపట్టాలని కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటి పరిష్కారానికి అవసరమయ్యే నిధులు కేటాయించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు .పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు వెంకటేష్,ప్రభాకర్,నర్సింహా,వేణు, యాదయ్య,సత్య నారాయణ, వెంకట్ స్వామి, యాదయ్య,ఈశ్వరయ్య,నారాయణ,మెస్సయ్య గోపనపల్లి తండా వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…