మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
డ్రోన్ బూట్ క్యాంపు నాలుగో రోజు, గీతం విద్యార్థులు డ్రోన్ అసెంబ్లీపై స్వీయ అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు, వాటిని ఎగరవేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిపుణుల మార్గదర్శనంలో, ఏడు క్వాడ్ ఎక్స్ కాప్టర్లను విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్ నిర్మాణం, పనితీరు పరీక్షలో విలువైన ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు.జీపీఎస్ ఆధారిత హెక్సాకాప్టర్ ను ఎగరవేయడానికి విద్యార్థులకు అవకాశం ఇచ్చారు. ఇది పరిశ్రమ స్థాయి డ్రోన్లలో ఉపయోగించే అధునాతన నావివేషన్, విమాన స్థిరీకరణ, నియంత్రణ వ్యవస్థలను తెలుసుకునే వీలు కల్పించింది. దీనికి అదనంగా, ప్రాథమిక విమాన నియంత్రణలు, యుక్తి పద్ధతులను అర్థం చేసుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బుల్లి (నానో) డ్రోన్ ఫ్లయింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.రోజంతా, విద్యార్థులు డ్రోన్ అసెంబ్లీ, క్రమాంకనం, విమాన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న వైమానిక సాంకేతికతల పట్ల ఆసక్తి, సాంకేతిక ఉత్సుకత, ఉత్సాహాన్ని ప్రదర్శించారు.మొత్తంమీద, డ్రోన్ బూట్ క్యాంపు పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించడమే గాక, డ్రోన్ సాంకేతికతలో సైద్ధాంతిక జ్జానాన్ని, వాస్తవ-ప్రపంచ వినియోగం మధ్య ఉన్న అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించింది.

