కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయం
మన వార్తలు ,పటాన్ చెరు:
పెన్నార్ పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులందరికీ రుణపడి ఉంటామని, కార్మికుల అందరి సహకారంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పటాన్చెరువు శాసనసభ్యులు, గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్కెవి రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి తాను బలపరిచిన అభ్యర్థి రాంబాబు యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాజమాన్యం నుండి న్యాయబద్ధంగా రావలసిన ప్రతి హక్కును సాధిస్తామని, ప్రధానంగా వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సహృద్భావ వాతావరణంలో విధులు నిర్వహించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్మికులందరూ సోదరభావంతో కలిసి మెలసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, పెన్నార్ పరిశ్రమ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…