మనవార్తలు , శేరిలింగంపల్లి :
జీవితంలో రాణించాలంటే చదువే కాదు క్రీడలు కూడా ముఖ్యమేనని వారు నిరూపిస్తున్నారు. ఇటు మంచి చదువే కాదు, తాము చేస్తున్న ఉద్యోగాలకు తోడు ఎంచుకున్న క్రీడలకు తగిన గుర్తింపును తీసుకువస్తుంన్నారు. రాంచచంద్రాపురం లో గల బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థి రామకృష్ణo రాజు ఒకరు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు.అయినప్పటికీ వారిలోని క్రీడానైపుణ్యాన్ని వదిలి పెట్టలేరు. బీచ్ వాలీబాల్ టీమ్ లో రాణిస్తున్నారు. రేపటి నుండి థాయిలాండ్ లో జరుగనున్న బీచ్ వాలీబాల్ టౌర్న మెంట్ కు భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి విద్యాలయ పూర్వ విద్యార్థి అయిన ఎం. రామకృష్ణo రాజు, టి. నరేష్ లు సెంట్రల్ టాక్స్ జి ఎస్టీ డిపార్ట్ మెంట్ లో ఇన్స్పెక్టర్ లు గా విధులు నిర్వహిస్తూనే తాము ఎంచుకున్న బీచ్ వాలీబాల్ పోటీల్లో దూసుకుపోతు పథకాల పంటపండిస్తున్నారు. ఈ నెల 21 నుండి 25 వరకు జరిగే 21 వ ఏషియన్ వాలీబాల్ కాన్ఫిడిరేషన్ అండ్ థాయిలాండ్ వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో బంగారు పథకాలతో దేశానికి తిరిగి రావాలని క్రీడాభిమానులు, గురువులు, స్నేహితులు కోరుతున్నారు.