Telangana

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్చెరులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

_సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన దీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం చాకలి ఐలమ్మ త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరువు పట్టణంలోని సాకి చెరువు కట్టపై త్వరలోనే ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీంతోపాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సొంత నిధులతో ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, రజక సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

10 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

10 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

10 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

22 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago