Telangana

గీతంలో విజయవంతంగా ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే అతి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ – టెక్ ఫెస్ట్, ఐఐటీ బాంబే యొక్క ప్రాంతీయ రౌండ్ అయిన టెక్ ఫెస్ట్ హైదరాబాద్ జోనల్స్ 2025ను విజయవంతంగా నిర్వహించింది. గీతంలోని ఈఈసీఈ విభాగంతో పాటు జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహించిన ఈ టెక్ ఫెస్ట్ జోనల్స్ పోటీలు విద్యార్థులలో ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో వారి నైపుణ్యాలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి జాతీయ వేదికను అందించారు.

హైదరాబాదు ఎడిషన్ లో నాలుగు ప్రధాన పోటీలు జరగ్గా, ఈ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
 కోడ్ కోడ్: ఆన్ లైన్ కోడింగ్ ఛాలెంజ్ (తొమ్మిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థుల వరకు)
 మెష్ మెరైజ్: లైన్ ఫాలోవర్ రోబోటిక్స్ ఛాలెంజ్
 కోజ్మో క్లెంచ్: పిక్ అండ్ ప్లేస్ మాన్యువల్ నియంత్రించే కంట్రోల్డ్ బాట్ పోటీ
 టీఎఫ్ వో (టెక్ ఫెస్ట్ ఒలింపియాడ్): పాఠశాల విద్యార్థుల కోసం టెక్నికల్ క్విజ్ (8-10 తరగతులు)

గీతంలోని ఆరుగురు అధ్యాపకులు, 40 మంది విద్యార్థి వాలంటీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది సమన్వయంలో దాదాపు 400 మందికి పైగా ఔత్సాహిక విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు అసాధారణమైన సృజనాత్మకత, బృంద కృషి, ఆవిష్కరణలను ప్రదర్శించి విజయవంతంగా ముగిశాయి. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవిల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, అధ్యాపకులు ఎం.నరేష్ కుమార్, బి. బాలాజీ నాయక్ సమన్వయం చేశారు. విద్యార్థి సమన్వయకర్తలు ఎం.గౌరీశంకర్, ఎ.వేణురెడ్డి తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి, విజయవంతం చేయడానికి కృషి చేశారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

15 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago