పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద అని గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద ,తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు,ఆ వాగ్దాటి ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానంద కావడం విశేషం. నేటి తరం యువత వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకుంటారు అని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారుఈ కార్యక్రమంలో వివేకానంద యుత్ సభ్యులు నవీన్ రెడ్డి ,మధుకర్ రెడ్డి ,సాయి తేజ, పటాన్ చేరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారు, ఎంపిటిసి నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు సుంకరి రవీందర్ , తలారీ ఆంజనేయులు ,గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…