మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని యువజన వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు ఏర్పాటు చేసిన 77 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన, ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి, సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరుశాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేసిన మహోన్నత నాయకులలో సుభాష్ చంద్రబోస్ ఒకరిని అన్నారు. ఆయన జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యువజన వికాస సమితి అధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, పృథ్వీరాజ్, శ్రీధర్ చారి, రుద్రారం శంకర్, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
