విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

 

మనవార్తలు,పటాన్‌చెరు:

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఫైటర్ వన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్, ఎల్లయ్య, కార్యక్రమ నిర్వాహకులు సతీష్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *