Telangana

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ది మాస్టర్ మైండ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ను స్కూల్ చైర్మన్ రాజు సంఘాని, ప్రిన్సిపాల్ నాగరాజు లతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని రకాల నాణ్యమైన విద్యను స్కూల్ యాజమాన్యం అందించాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు చేయడం జరుగుతుందని, వారి నమ్మకాన్ని విద్యార్థులు నెరవేర్చాలని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ముఖ్యంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో వారికి సంబంధించిన వాటినే తీసుకొని, మిగతా వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల పోటీ పరీక్షలలో విద్యార్థులు రాణించాలని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని స్కూల్ కు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తూ, క్రమశిక్షణకు మారుపేరుగా ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, శివకుమార్ గౌడ్, హర్షరెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, నిజాంబాద్ శ్రీనివాస్, ది మాస్టర్ మైండ్స్ స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago