సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..??
పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిపిఎల్ చౌరస్త వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిగాచీ బాధిత కుటుంబాలతో ర్యాలీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
సీఎం రేవంత్ రెడ్డి సిగాచీ బాధితులకు ఇచ్చిన కోటి రూపాయలు హామీ నెరవేర్చరా..?? అని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. సిగాచీ ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడ లో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో సిగాచి బా ధిత కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ మాణిక్ మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృత్యుఘోష ఘటనకు ఏడాది అయిందన్నారు. మృతుల బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చరా..? అని ప్రశ్నించారు. దేశంలోనే భూపాల్ ఘటన తర్వాత సిగాచీ ప్రమాద దుర్ఘటనే అన్నారు. 54 మంది మృతి చెంది అందులో 8 మంది పూర్తిగా కాలి బూడిదయి డిఎన్ఏ టెస్ట్ కు సైతం దొరకకపోవడం చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. మరో 28 మంది కార్మికులు తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాల బతుకీడుస్తున్నారని వాపోయారు. ఆసుపత్రి చూపించుకునేందుకు డబ్బులు లేక కుటుంబాలు గడవక ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి ప్రకటించారని, ఇదే విషయాన్ని యాజమాన్యం సెబీ కిచ్చిన లేఖలో ప్రకటించిందని, ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇంకా పూర్తి నష్టపరిహారం అందకపోవడం దారుణం అని అన్నారు. 42 లక్షల నుండి 50 లక్షల వరకు నష్టపరిహారం అందిందాయని, 54మందికి మొత్తంగా 24.61కోట్లు అందిందాయాని, ఇంకా 29.38కోట్లు అందవల్సిఉందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షలు కొంత మందికి అందలేదని, నష్టపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష ,కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు కలుపుతున్నారన్నారు. ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ యాజమాన్యంపై కంటి తుడుపు చర్యగా కంపెనీ సీఈవో ను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. బాధిత కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వమంటే యాజమాన్యానికి చేతులు రావడంలేదని ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందని మండిపడ్డారు. సిగాచీ ప్రమాదం నుండి గుణపాఠం తీసుకొని పరిశ్రమల్లో కార్మికుల భద్రత రక్షణ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనేక పరిశ్రమలో రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయని అందుకు యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని, బాధిత కుటుంబాలకు మిగతా నష్టపరిహారం ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు రాజు, నాయకులు సంతోష్ గౌడ్, శేఖర్ రెడ్డి, రాజశేఖర్, చరణ్, రమేష్, నాగరాజు, వెంకటేష్, దుర్గేష్, మరియు మృతి చెందిన కార్మికుల కుటుంబాల సభ్యులు జస్టిన్, భీమ్రావు, అన్సారి, అఖిలేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సన్ వే ఓపస్, ప్రైడ్ పార్కు కాలనీలో 5 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి నరేందర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర…
గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు…