Telangana

పురోహితుడిపై చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలి ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ విఎస్ రాజు మాదిగ

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం :

పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనపై ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎమ్ ఎమ్ ఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు ఆలయాని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు మాట్లాడుతూ తమ జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఎసి సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పురోహితుడిపై చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలని వారు కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు ఎమ్ ఆర్ పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిన్నారిపై ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత నీచమైన చర్యగా వారు అభివర్ణించారు. బాధిత బాలిక నిందితుడి మనవరాలి వయసులో ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ , ప్రవీణ్, రమేష్, బందేల రవికుమార్, కృష్ణ, యేసయ్యా, ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago