_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు
మనవార్తలు ,పటాన్ చెరు;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల సైతం గురికావాల్సింది వస్తుందని వాపోయారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సువీశాల విస్తీర్ణంలో, ఆధునిక వసతులతో కోర్టు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అడ్వకేట్లు ప్రభుదన్యం, రమేష్, శ్రీనివాస్, రవికుమార్, నాగరాజు, రమాదేవి, రవి, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…