మనవార్తలు ప్రతినిధి,మియాపూర్ :
తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు తో కలిసి శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూపాపన్న గౌడ్ గారి జీవితం ధైర్యానికి ప్రతీక ఆయన పోరాటం సమానత్వానికి స్ఫూర్తి ప్రజల కోసం నిలబడే ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం మార్గదర్శకం.” అని అన్నారు.సామాన్య కుటుంబం నుంచి ఎదిగి, అన్యాయాన్ని ఎదురించి, ప్రజల హక్కులు మరియు స్వాభిమానం కోసం పోరాడిన పాపన్న గౌడ్ గారి చరిత్ర తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దాం అని అన్నారు .ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ అశోక్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌడ్ సంఘం అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ నల్ల సంజీవ రెడ్డి, శ్రీ బల్లింగ్ యాదగిరి గౌడ్, శ్రీ రమణ మూర్తి, శ్రీ సయ్యద్ గౌస్, శ్రీ వీరేందర్ గౌడ్, శ్రీ ఓం ప్రకాష్ గౌడ్, శ్రీ సత్యం గౌడ్, శ్రీ కనకమామిడి నరేందర్ గౌడ్, శ్రీ యాదగిరి గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీ మోహన్ గౌడ్, శ్రీ బాలింగ్ గౌతమ్ గౌడ్, శ్రీ కరుణాకర్ గౌడ్, శ్రీ మన్నేపల్లి సాంబశివరావు, మహిళా కాంగ్రెస్ డీసీసీ కార్యదర్శి శ్రీమతి శిరీష సత్తూరు, బ్లాక్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి కల్పన ఏకాంత్ గౌడ్, శ్రీమతి అనిత, శ్రీమతి శేషిరేఖ, శ్రీమతి శ్రీజ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీమతి జయ, శ్రీమతి పార్వతి, శ్రీమతి నాజియా తదితరులు పాల్గొన్నారు.
