పటాన్చెరు:
శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణుడి రథయాత్ర నిర్వహించారు. స్థానిక కోదండ సీతారామస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా సాగింది.
భక్తుల జయజయ ధ్వానాల నడుమ, హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కీర్తనలు ఆలపిస్తూ యాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా పలు కూడళ్లలో ఉట్టిలు కొట్టడం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఉట్టి కొట్టి అందరిని ఉత్సాహ పరిచారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడిని కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి , విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, ఎట్టయ్య, గోపాల్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, రాజు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…