ఆరిజిన్ పాఠశాల వేదికగా సౌత్ జోన్–1 తైక్వాండో పోటీలు
ఐదు రాష్ట్రాల నుండి 3000 మంది క్రీడాకారుల హాజరు
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
క్రీడలు ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగం కావాలని శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పటాన్‌చెరుశాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఆరిజిన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీబీఎస్ఈ పాఠశాలల సౌత్ జోన్–1 తైక్వాండో పోటీలను ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన క్రీడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పటాన్‌చెరు మైత్రి మైదానం వేదికగా ఏడాది పొడవునా వివిధ క్రీడా అంశాలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు, యువకులు తమ ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పటాన్‌చెరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీలలో పాల్గొనడం పట్ల అభినందనలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల క్రీడలకు వేదికగా నిలిచిన ఆరిజిన్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీబీఎస్ఈ అబ్జర్వర్ దురై, ఆల్ఫా స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్లు వెంకటేష్, రాంబాబు, ఆరిజిన్ పాఠశాల చైర్మన్ ప్రమోద్, క్రీడాకారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…