Categories: politics

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నషా ముక్తి భారత్ అభియాన్, బ్రాహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ
యువత దేశ భవిష్యత్తు అని, వారిని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, సామాజిక సంస్థలు, ప్రజలందరిపై ఉందని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తు కూడా తీవ్రంగా దెబ్బతింటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం నేరాలు, హింస, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

యువత చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించి తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి విద్యాసంస్థ డ్రగ్స్ రహిత ప్రాంతంగా మారాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, బాల్ రెడ్డి, నర్రా బిక్షపతి, అశోక్, హనుమంత్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, పృథ్వీరాజ్, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago