Telangana

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి కావాల్సిందే

అతి త్వరలో మినీ ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్ళ ప్రారంభం

చెరువులు, కుంటలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపండి

రెండు ఎకరాల్లో స్లాటర్ హౌస్

జిహెచ్ఎంసి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

అమీన్పూర్, పటాన్‌చెరు బల్దియా సర్కిల్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు, అమీన్పూర్ సర్కిల్ల పరిధిలోని డివిజన్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలపై చర్చించారు.ప్రధానంగా మినీ ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇండోర్ స్టేడియం, అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని సూచించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలో నిర్మిస్తున్న వార్డు కార్యాలయాన్ని ప్రత్యేకతను పూర్తి చేయాలన్నారు.

ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలోగల వివేకానంద స్టేడియం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27 కోట్ల రూపాయలు మంజూరు చేశాయని  పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు.పటాన్‌చెరు డివిజన్ పరిధిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో స్లాటర్ హౌస్ (పశు వదశాల) నిర్మించబోతున్నట్లు తెలిపారు. 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో..ఆధునిక వసతులతో నూతన టెక్నాలజీతో నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ భూములలో లేఔట్లు, అనుమతి లేని నిర్మాణాలు, అక్రమంలో కొనసాగకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ .. కబ్జాదారుల పైన ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మార్వో హరిబాబు, రామచంద్రపురం తహసిల్దార్ సరస్వతి, విద్యుత్ శాఖ డి ఈ భాస్కరరావు, నీటిపారుదల శాఖ ఈ ఈ భీమ్, డి ఈ రామస్వామి, జిహెచ్ఎంసి ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

9 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

10 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago