పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సునీత ప్రత్తిపాటి గణిత క్వాంటమ్ భౌతిక శాస్త్రాల సంయుక్త పరిశోధనతో డాక్టరేట్ అర్హత సాధించారు. ‘సమరూప్యతానుకూల లీ బీజగణితం ఉపయోగించి సూక్ష్మ, మధ్యస్థ అణువుల ప్రకంపన పౌనఃపున్యాల గణింపు అధ్యయనంపై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనలను సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న గణిత శాస్త్ర విభాగం సహ ఆచార్యుడు డాక్టర్ విజయశేఖర్. జాలిపర్తి, భౌతికశాస్త్ర విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ ముల్లేశ్వరరావు బళ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రఖ్యాత జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం, కొలకత్తా లోని గణిత శాస్త్ర విభాగం ఆచార్యుడు. ప్రొఫెసర్ ఫరూక్ రెహ్మాన్ దీనికి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు. సునీత ప్రత్తిపాటి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీపీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…