Telangana

ఆక్రమణకు గురవుతున్న సొసైటీ స్థలం

_ధ్వంసమైన క్రీడా ప్రాంగణం

– చర్యలు తీసుకోవడంలో విఫలమైన జిహెచ్ఎంసి అధికారులు.

_సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

చిన్నారుల ఆహ్లాదం కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రీడా ప్రాంగణం పూర్తిగా ధ్వంసం అయింది. క్రీడా ప్రాంగణానికి ఆనుకొని జరుగుతున్న ఓ నిర్మాణ వ్యర్ధాలను, సామాగ్రిని క్రీడా ప్రాంగణంలో వేయడంతో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నిత్యం ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఖరీదైన సొసైటీ స్థలం అన్యాక్రాంతం అవుతున్న కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు గాని, సొసైటీ సభ్యులు గాని చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల పాత ఎం. ఐ. జి కాలనిలో గతం లో చిన్నపిల్లలు  స్థానిక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన నిర్మాణం కావడంతోనే సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు వెనకడుగు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కోటిన్నర విలువచేసే ఖరీదైన స్థలం కబ్జా అవుతున్నా సొసైటీ సభ్యులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రి పూర్తిగా ద్వoసమవడంతో చిన్నారులకు క్రీడా ప్రాంగణం కరువైందని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు జి. హెచ్. ఎం. సి. అధికారులు గాని, సొసైటీ సభ్యులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago