మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రపంచ భవిష్యత్తును , నగరాల భవిష్యత్తును వేరుచేయడం కష్టమని , ప్రపంచ జనాభాలో సగానికి పైగా నగరాలు 80 శాతం స్థూల జాతీయోత్పత్తిని ( జీడీపీ ) అందిస్తున్నాయని బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) రావు మునుకుట్ల చెప్పారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఆయన ‘ స్మార్ట్ సిటీస్ – ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్ ‘ ( బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ – ఓ అధ్యయనం ) అనే అంశంపై ఆయన ప్రసంగించారు . ‘ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , స్మార్ట్ సిటీల రంగంలో తనకున్న విశేష అనుభవం , నెపుణ్యాలను విద్యార్థులతో పంచుకున్నారు . ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మంది 2050 నాటికి పట్టణాలలోనే నివసిస్తారని , 90 శాతం ఆర్థిక కార్యకలాపాలు అక్కడే జరుగుతాయని జోస్యం చెప్పారు . ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2030 నాటికి మెగాసిటీలలో నివసించే వారి సంఖ్య 35 శాతం పెరుగుతుందని , అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోనే ఇది ఎక్కువగా జరుగుతుందన్నారు .
ఓ అంచనా ప్రకారం , 2017 లో ఒక్క అమెరికాలోనే ట్రాఫిక్ – సంబంధిత రద్దీ ఖర్చులు 300 బిలియన్ల డాలర్లను అధిగమించినట్టు ఆయన చెప్పారు . పట్టణీకరణ మార్కెట్ వృద్ధిని నడిపించే స్మార్ట్ టెక్నాలజీ చొరవలను కోరుతోందని , ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతోందన్నారు . నగరాల పెరుగుదల సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు . ఆర్థికాభివృద్ధికి అవినాభావ – ప్రపంచం పట్టణీకరణ దిశగా పయనిస్తోందని , పెరుగుతున్న పట్టణీకరణ , మౌలిక సదుపాయాలు , ఆస్తుల నిర్వహణ ఆవశ్యకత ప్రపంచ దేశాలను స్మార్ట్ సిటీల ఏర్పాటు దిశగా పురిగొల్పుతున్నాయని రావు చెప్పారు . స్మార్ట్ సిటీ పునాదులు , స్మార్ట్ ఆర్కిటెక్చర్ , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు , పౌరుల దృక్పథం వంటి అంశాలను ఆయన విశదీకరించారు .
బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ ప్రాజెక్టుతో పాటు స్టార్టప్లు , పరిశోధనలు చేపట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు . ప్రపంచ నడవడికి అనుగుణంగా విద్యా సంస్థల్లోని విద్యార్థుల మధ్య అంతర్ – విభాగ పరిశోధనలు , సంబంధిత కార్యకలాపాల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు . సమస్య పరిష్కారానికి దారితీస్తుందని , సమాజానికి ఇతోధిక ప్రయోజనాలను స్వచ్ఛందంగా అందించాలని రావు పిలుపునిచ్చారు . విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన ఆకట్టుకునేలా జవాబులిచ్చి వారిని ఉత్సాహపరిచారు . తొలుత , సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ శివరామ కృష్ణప్రసాద్ బెల్లం అతిథిని సత్కరించారు . ఈ కార్యక్రమంలో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ పి.ఈశ్వరయ్య , ప్రొఫెసర్ పి.త్రినాథరావు , డాక్టర్ జి.జ్యోతికుమారి తదితరులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…