అన్న కోసం చెల్లెలు పాడిన పాట
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కోసం సింగర్ మధుప్రియ ” అన్న కోసం చెల్లెలు పాడిన” పాటను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆవిష్కరించారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ క్యాంపు కార్యాలయానికి మంత్రి దామోదర రాజనర్సింహా సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సింగర్ మధుప్రియతో కలిసి పాటను ఆవిష్కరించారు. అనంతరం పాట వీడియోను మంత్రి తిలకించారు.