రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కన్నులపండువగా
వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రుద్రారంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో శ్రీ వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ రోజు దేవాలయంలో స్వామివారికి శోభాయమానంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ రోజు సిద్ధి గణపతి స్వామివారు నయన మనోహరమైన పలువర్ణాల సుగంధ పుష్పాల అలంకరణలో భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. రంగురంగుల పుష్పాలతో తీర్చిదిద్దిన విశేష వర్ణాల అలంకరణలో స్వామివారి రూపాన్ని దర్శించుకుని భక్తజనం పులకించిపోయారు.సూర్యోదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, ద్రవ్య అర్చనలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు మరియు సహస్ర నామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల విదేశీ, స్వదేశీ సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి మహామంగళ హారతి ఇచ్చారు.స్వామివారి విశేష అలంకార దర్శనానికి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా “ఓం శ్రీ గణేశాయ నమః”, “గాణపత్య బాపా మోరియా” అనే నామస్మరణలతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, ప్రసాద వితరణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ తీర్థప్రసాదాలను స్వీకరించి భక్తులు స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.
-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్ -అభినందించిన జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…
పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…