దసరా, బతుకమ్మ వేడుకల్లో సేవా కార్యక్రమం

politics Telangana

మహిళలకు చీరలు.. ఆటో డ్రైవర్లకు బహుమతులు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పండుగ కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ నగర్ ఫేస్-1, ఫేస్-2 మహిళలకు, మున్సిపల్ సిబ్బందికి చీరలు, ఆటో డ్రైవర్లకు దుస్తులు, బహుమతులు అందజేశారు. బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలతో సంతోషాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ నగర్ ఫేస్-1, ఫేస్-2 నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *