మనవార్తలు ప్రతినిధి,శేరిలింగంపల్లి:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణామ్ హాస్పిటల్స్ ముందుకు రావడం సంతోషకరమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ అన్నారు .శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలోప్రణామ్ హాస్పిటల్స్ నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవనికి ముఖ్య అతిధిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని పారరంభించారు .అనంతరం మాట్లాడుతూ మదీనాగూడలో నూతన సుమారు 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో మల్టీస్పెషాలిటీ వైద్య సేవలతో పాటు మాతృత్వం, చిన్నారుల వైద్య విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం చాల సంతోషమని తెలిపారు .ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ గారు, ఆసుపత్రి యాజమాన్యులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, నియోజకవర్గ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు టీం యలమంచి ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…