Telangana

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి  – శేరిలింగంపల్లి :

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్. జగదీశ్వర్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యలమంచి ఉదయ్ కిరణ్, మహిళా ప్రెసిడెంట్ సునీత రెడ్డి, యూత్ నాయకుడు సౌoదర్య రాజన్, ఎం. సాంబశివ రావు లు పాల్గొని నవీన్ యాదవ్ గారి విజయానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రచారం చేశారు.ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలని వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలను మార్చుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువత కాంగ్రెస్ కార్యకర్తలు, మరియు పలువురు పార్టీ అభిమానులు ఘనంగా పాల్గొని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ఉత్సాహభరితమైన మద్దతు ప్రకటించారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago