మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి 106 డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీనీ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప మహిళా కార్యాలయం లో శేరిలింగంపల్లి బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసి నూతన కమిటీని నియమించారు. ముఖ్యాతిధిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ముఖ్య నాయకులు నర్సింలు ముదిరాజ్ లు పాల్గొని మహిళ కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు.
శేరిలింగంపల్లి 106 డివిజన్ అధ్యక్షురాలుగా ఆర్. అనిత, ఉపాధ్యక్షురాలు ఎం.. సునంద, మరియు కే. రాజమణి, సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగమణి. కోశాధికారిగా ప్రతిమ లను నియమించగా వారు నియామక పత్రాలను స్వీకరించారు. మన సమస్యలతో పాటు కాలనీ సమస్యలను పరిష్కరించుకొనుటకు మీరందరూ సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుటకు మేమందరం మీ వెంట ఉన్నామని, మీరందరూ మా వెంట ఉండి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందామని సంఘం సభ్యులు తెలిపారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో 17 శాతం మాత్రమే లబ్ది పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారనీ, మనకు 42 శాతం ఉండాలి కాబట్టి 42 శాతం ప్రత్యక్షంగా బీసీలు లబ్ధి పొందే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం స్థానిక ఎన్నికల్లోను సర్పంచ్ ఎంపీటీసీ, జెడ్పిటిసి కార్పొరేటర్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ లు కూడా 42 శాతం రిజర్వేషన్ చేసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు పురుషులతో సమానం కాబట్టి అందరూ పోరాడండి పోరాడుతే ఈ ప్రజాస్వామ్యంలో మనకు న్యాయం జరుగుతుందనీ, సామాజిక న్యాయం మరియు రాజకీయ న్యాయం జరిగే వరకూ పోరాడుదామని పిలుపునిచ్చారు. తమ ఫై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వంతు కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసి, బీసీల ఐక్యత కు పాటుపడతామనీ అధ్యక్షురాలు అనిత మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం లో బి గంగ, ఆర్. లతటీ. అంకమ్మ, జ్యోతి, ఎం పద్మ, పద్మాదేవి,జి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…