మనవార్తలు ,పటాన్ చెరు:
శాస్త్రం ( సెన్స్డ్ ) సమాజంతో ముడిపడి ఉందని , అది సమాజాన్ని ప్రభావితం చేస్తుందని , అదే సమయంలో సమాజం వల్ల ప్రభావితమవుతుందని భాభా అణు పరిశోధనా సంస్థ పూర్వ డెరైక్టర్ , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిపుణుడు డాక్టర్ కె.ఎల్.రామకుమార్ అన్నారు . సర్ సీవీ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ను గుర్తుంచుకోవడానికి , మన జాతి , విశ్వాభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతియేటా నిర్వహించే జాతీయ సెన్స్ దినోత్సవాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముందస్తుగా రికార్డు చేసిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , కొత్త శాస్త్రీయ జ్ఞానం నూతన ఆవిష్కరణకు దారితీయొచ్చని , డీఎన్ఏ నిర్మాణం ఆవిష్కరణ జీవశాస్త్రంలో ఒక ప్రాథమిక పురోగతి అని చెప్పారు . ఇది డీఎన్ఏ వేలిముద్రలు , జన్యుపరంగా మార్పిడి చేసిన పంటలు , జన్యు వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో సహా అనేక రకాల ఆచరణాత్మక విధానాలకు దారితీసినట్టు వివరించారు .
నిర్మాణాత్మక యోచన శాస్త్రీయ పరిశోధనలను ప్రేరేపించవచ్చని , మలేరియా వంటి వ్యాధులకు మందులను చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఈ రంగంలోని అనేకమంది పరిశోధకులను సూక్ష్మజీవుల జన్యుశాస్త్రంపై అధ్యయనాలను కొనసాగించడానికి ప్రేరేపిస్తోందన్నారు . శాస్త్రం లేకపోతే సమాజం పురోగమించదని , సమాజానికి ఉపకరించే విధంగా శాస్త్రం తోడ్పడాలని గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ సూచించారు . తొలుత విద్యార్థులందరికీ జాతీయ సెన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . జాతీయ సెన్ట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ – టెక్నాలజీలు సంయుక్తంగా జాతీయాభివృ ద్ధిలో శాస్త్ర సహకారం , మెరుగైన భవిష్యత్తు కోసం మన పర్యావరణం సురక్షితంగా ఉందా ? నేటి యువతలో కుటుంబ విలువలు – సంస్కృతి ప్రభావం అనే మూడు అంశాలపై ‘ శాస్త్ర – సాంకేతిక అంశాలపై అఖిల భారత వ్యాసరచన పోటీలను నిర్వహించాయి . మనదేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన 33 మందిని ఆన్లైన్లో మౌఖికంగా విశ్లేషించి , విజేతలను ఎంపిక చేశారు .
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన ఆకాంక్ష చౌహాను రూ .20,000 / – నగదు పురస్కారం , సర్వేల్లోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఆర్యన్ నూకాకు ద్వితీయ బహుమతిగా రూ .15,000 / – , తృ తీయ బహుమతిగా కేరళ – ఎర్రూర్లోని భవన్స్ విద్యా మందిర్కు చెందిన లావణ్య రాజన్ , న్యూఢిల్లీ – చాణక్యపురిలోని నౌకాదళ పాఠశాలకు చెందిన సమ్రాట్ వశిష్ట్ రూ .10,000 / – , మిగిలిన 26 మందికి ఒక్కొక్కరికి రూ .2,000 / -ల నగదు , ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు . ఈ కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఇంజనీరింగ్ డెరైక్టర్ వీకే మిట్టల్ తదితరులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…