Telangana

మహిళ లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే: నీలం మధు ముదిరాజ్

సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన నీలం మధు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చి చదువుకునేలాగా ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి దిక్సూచి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిట్కుల్ లోని ఎంఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల హక్కుల సాధనలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. మహిళలు చదువుకోవాలని వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారన్నారు.ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహనీయురాలు చేసిన కృషి తోనే సాధ్యమైందన్నారు.ఆ మహనీయురాలి జయంతిని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago