పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన గానంతో, ధూమ్ ధామ్ పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు, గొప్ప నాయకుడిగా ఎదిగే క్రమంలో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభలో అంతా తానై తన పాటలతో ప్రజలందరినీ చైతన్యపరచడంతో పాటు, పటాన్చెరులో ఏ కార్యక్రమం నిర్వహించిన అన్న నేను వస్తానంటూ ఆప్యాయంగా కార్యక్రమాలకు హాజరయ్యే వాడని గుర్తు చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం గొప్ప కళాకారుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…