రోడ్డు నిర్మాణంలో పాలకులు విఫలం…
– కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్‌చెరు:
గత ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన బీరంగూడ – కిష్టారెడ్డిపేట వెళ్లే రహదారిని నిర్మించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
ఆదివారం రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… రోడ్డు నిర్మాణం పనులలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. వంద ఫీట్లతో నిర్మించాల్సిన ఈ యొక్క రోడ్డును స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తితో రోడ్డు వెడల్పు పూర్తిస్థాయిలో తగ్గించారని ఆరోపించారు. రోడ్డు నిర్మాణంలో జాప్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పాలకులకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ యొక్క రహదారిని నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్మించే విధంగా చూడాలన్నారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శశిధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్, రవీందర్, కె.శ్రీనివాస్, ప్రకాష్, లింగంగౌడ్,
సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, సిద్దు, మహిపాల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…