గీతమ్ లో రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లో గురువారం ప్రముఖ పద్మవిభూషణ్ రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి వేడుకలను నిర్వహించి, భరత నాట్యానికి ఆమె అందించిన అమూల్యమెన కృషికి హృదయపూర్వక నివాళులు అర్పించారు. తొలుత, భరతనాట్య ఆచార్యురాలు అక్షయ జనార్ధనన్, తోటి అధ్యాపకులు, పలువురు విద్యార్థులతో కలిసి రుక్మిణీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలరిప్పు, తిల్లానాలతో పాటు వివిధ ఆకర్షణీయమెన భరతనాట్య వ్యక్తీకరణలతో కూడిన ప్రదర్శన ద్వారా ఆమె భరతనాట్య వారసత్వానికి నివాళులర్పించారు.గంటపాటు సాగిన ఈ నృత్య ప్రదర్శన సంప్రదాయాన్ని చెతన్యంతో పెనవేసుకుని, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మార్మోగింది.రుక్మిణీ దేవి జీవితం, భరత నాట్యానికి ఆమె చేసిన సేవల గురించి డాక్టర్ లలిత సింధూరి వివరించగా, బీఏ-సైకాలజీ , బీటెక్ (సీఎస్ఈ- ఎఐ అండ్ ఎంఎల్) విద్యార్థులు ఉమా శ్రీనిధి, మనస్వి బోడపాటి అక్షయ అభినయంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రుక్మిణీ దేవిపై డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.

మొక్కలు నాటి వినూత్న వీడ్కోలు

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,హై దరాబాద్ లో చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ వీడ్కోలు దినోత్సవాన్ని ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా, వర్సిటీతో వారి బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ, బీకాం, ఫార్మసీ, బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర చివరి ఏడాది విద్యార్థులు తలకు ఒకటి చొప్పున మామిడి, జామ, అవకాడు, దానిమ్మ, నిమ్మ, రావి, వేప వంటి పలు పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటి, ఓ జీవితకాలం నిలిచి ఉండే ఈ మొక్కలు, గీతమ్ లో తమ సమయాన్ని శాశ్వతమైన జ్ఞాపకంగా మలుచుకున్నారు.అటు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఇటు తాము చదువుకున్న విద్యా సంస్థతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవడం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఆ మొక్కలు బొగ్గుపులుసు వాయువును తగ్గించడమే కాక, భూ కోతను నిరోధించడానికి, నేలను స్థిరీకరించి, సహజ నీటి వడపోతను పెంపొందించడంలో సహకరిస్తాయని ఆయా విద్యార్థులు చెప్పారు.గీతం స్టూడెంట్ లైఫ్ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో గీతం తోటపని సిబ్బంది సహకారంతో ఈ వీడ్కోలు వేడుక విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *