Telangana

సొంత నిధులతో రహదారికి మరమ్మతులు_ మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో ఇంద్రేశం రహదారి పునరుద్ధరణ (మరమ్మతు) పనులను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంద్రేశం నుండి చిన్న కంజర్ల వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.​అనంతరం మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు – చిన్న కంజర్ల మార్గంలో ప్రతిరోజు ప్రయాణించే పాల వ్యాపారులు, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి రాగానే, ప్రజల రవాణా కష్టాలను ఎంతోకొంత తీర్చాలనే ఉద్దేశంతో తక్షణమే సొంత ఖర్చులతో గుంతలను పూడ్చి రహదారిని పునరుద్ధరించినట్లు వెల్లడించారు.అనంతరం ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ నూతన రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరారు.​ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వచ్చి రహదారి సమస్యను పరిష్కరించిన మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి శ్రద్ధ మరియు నిబద్ధతను ఇంద్రేశం గ్రామ ప్రజలు, వాహనదారులు హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago