మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్కుల్‌లోని ఆయన నివాసంలో పలువురు మహిళలు నీలం మధుకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మిఠాయిలు తినిపించి, ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది కేవలం దారం కట్టే సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర విశ్వాసం, రక్షణకు ఇచ్చే మాట అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, భద్రంగా జీవించే వాతావరణాన్ని కల్పించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్నారు. మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. సోదరభావం, సామాజిక ఐక్యతను పెంపొందించే ఇలాంటి పండుగలు సమాజాన్ని మరింత చైతన్యవంతం చేస్తాయని చెప్పారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…