Telangana

సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు : ఎమ్మెల్యే జిఎంఆర్

_ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో ఘనంగా గురుపూజోత్సవం

_నియోజకవర్గ పరిధిలోని 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం

_అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు

మనవార్తలు ,పటాన్ చెరు:

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ వేడుకలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఊరు మనబడి కార్యక్రమం ప్రారంభించి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజు తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని, ఇది సంతోషకరమైన పరిణామం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం పేరిట గత 21 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీపీగా ఉన్నప్పటినుండి 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. నవభారతానికి వెన్నుముకలుగా నిలిచే విద్యార్థులను భాయ్ భారత పౌరులుగా తీర్చిదిదద్దే ఉపాధ్యాయ రంగం అంటే తనకు ఎనలేని అభిమానం అన్నారు.మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో విభిన్న రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన నిరుపేద కుటుంబాల పిల్లలు అత్యధిక శాతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. వారిని అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దాలని విన్నవించారు. ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులతో నూతన పాఠశాల, కళాశాల భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.విద్యతో పాటు క్రీడారంగంపై ఆసక్తి పెంపొందించేందుకు ఐదు ఎకరాల సుశీల విస్తీర్ణంలో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణం లో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.కార్యక్రమానికి హాజరైన ప్రతి ఉపాధ్యాయుడికి, ఉపాధ్యాయురాలికి ప్రత్యేక బహుమతులు అందచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానంధం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగా రెడ్డి, రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…

4 days ago

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…

5 days ago

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…

6 days ago

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా…

6 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…

6 days ago

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…

6 days ago