శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
ఇటీవల విడుదలైన ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశానికి సంబందించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలలో హైదరాబాద్ లోని రెసొనెన్స్ జూనియర్ కళాశాల విధ్యార్ధులు అద్బుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఐఐటి, ఎన్‌ఐటి, ఎన్‌ఇఇటి, మెడికల్ ప్రవేశ పరీక్షలలో అగ్రశ్రేణి ర్యాంకర్లను తయారు చేయడంలో రెసొనెన్స్ జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్. రెసొనెన్స్ జూనియర్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పరీక్షలో అత్యుత్తమ స్కోర్ సాధించారు. టాప్ స్కోర్ సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్ధులను వారి తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో మాదాపూర్‌లోని రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో రెసొనెన్స్ హైదరాబాద్ సెంటర్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జేఈఈ పరీక్షలో రెసొనెన్స్ అద్భుత ఫలితాలను సాధించిందన్నారు. ఇది రెసొనెన్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ఒక అఖండ విజయం అని అన్నారు. కోట రాజస్థాన్ నుండి 2001 సంవత్సరంలో మిస్టర్ ఆర్.కె.వర్మ ఐఐటి మద్రాస్‌చే స్థాపించబడిన అఖిల భారత సంస్థ రెసొనెన్స్. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన నాటి నుండి, రెసొనెన్స్ 150 కేంద్రాలతో 87 నగరాల్లో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నదని, రెసొనెన్స్ 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణను ఇచ్చింది మరియు ఇప్పటి వరకు 3 లక్షల కు పైగా ఐఐటి, ఎన్‌ఐటి మరియు మెడికల్ ర్యాంకర్లను తయారు చేసిందని తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…