Telangana

గీతమ్ లో విజయవంతంగా ముగిసిన ఎఫ్ డీపీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) ‘5జీ టెక్నాలజీ, ఆపైనె పురోగతి’ అనే అంశంపై రెండు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ ) ఇటీవల నిర్వహించినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీలో 5జీ టెక్నాలజీ, పరిశోధనా రంగాలలో తాజా పరిణామాలను సదస్యులకు పరిచయం చేయడం లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఐఈఐ తెలంగాణ విభాగం పూర్వ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5జీ టెక్నాలజీలో అభివృద్ధిని అందిపుచ్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో పరిశ్రమ నిపుణులు 5జీ టెక్నాలజీకి సంబంధించిన వివిధ అంశాలపై లోతెన అవగాహన కల్పించారు. 5జీ కమ్యూనికేషన్స్ ప్రాథమిక అంశాలపై తేజోసెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రమణ రావూరి; 5జీ అభివృద్ధి విధానాలు, భవిష్యత్తు నెట్ వర్క్ లపై సిగ్వర్క్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుభ్ర ప్రకాష్: బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్లలో లేజర్ మూలాల పాత్రపై రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మార్తా ఎన్.రెడ్డి తదితరులు ప్రసంగించారు. 5జీ నెట్ వర్క్ లలో భద్రత, గోప్యత సవాళ్ల గురించి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ చెందిన డాక్టర్ ప్రఫుల్ మాస్కర్ వివరించారు.ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి స్వాగతోపన్యాసం చేయగా, కార్యక్రమ సమన్వయకర్త ఎం.రఘుపతి వందన సమర్పణ చేశారు. ఎఫ్ఎసీ ప్రారంభోత్సవంలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేటెడ్ డైరెక్టర్ క్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పరిశ్రమ నిపుణులు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ కాంట్రాక్టర్ల ‘చలో హైదరాబాద్’ మహాసభ

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో కాంట్రాక్టర్ల పేండింగ్ బిల్లులు…

2 days ago

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, యజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ హక్కులు కల్పించకుండ పేరుకే బిస్లరీ…

2 days ago

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో 6వ ఎడిషన్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా,…

2 days ago

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…

2 days ago

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…

2 days ago

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…

2 days ago