– గీతం వర్క్షాప్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ స్పష్టీకరణ
మనవార్తలు ,పటాన్ చెరు:
ఒక నిర్దిష్ట వాతావరణంలో , తగిన సమయ వ్యవధిలో , వెఫల్యం లేకుండా , ఉద్దేశించిన పనితీరును నిర్వర్తించడమే విశ్వసనీయ సాంకేతికత అని అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పుచ్చా అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ‘ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . విశ్వసనీయ సాంకేతికత లక్ష్యం ఒక ప్రక్రియ స్వాభావిక విశ్వసనీయతను మూల్యాంకనం చేయడమని ఆయన చెప్పారు .
ఒక వంతెన , రిజర్వాయర్ లేదా భవన నిర్మాణంలో కాంక్రీటు నాణ్యత ముఖ్య భూమిక పోషిస్తుందని , అందువల్ల నాణ్యతపై నిరంతర నియంత్రణ అవసరమని ఆయన స్పష్టీకరించారు . కాంక్రీటు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఉదాహరణలతో సహా వివరించారు . ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు జవాబివ్వడమే కాకుండా స్వీయ అనుభవాలను కూడా సదస్యులతో పంచుకున్నారు .
P తొలుత , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావుతో కలిసి సివిల్ విభాగాధిపతి డాక్టర్ బీఎస్ఆర్కే ప్రసాద్ అతిథిని స్వాగతించి , సత్కరించి , సదస్యులకు పరిచయం చేశారు . ఇంజనీరింగ్ అధ్యాపకులు , విద్యార్థులు , పరిశోధకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…