జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా రాథోడ్ శ్రీనివాస్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

కర్థనూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాథోడ్ శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లో ఏకేఎఫ్ఐ నిర్వహించిన జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో ఆయన ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో విజయవంతమై జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా అర్హత పొందారు.కబడ్డీ క్రీడలో కోచ్‌గా సేవలందిస్తూ జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతగా అర్హత సాధించడంపై జిల్లా కబడ్డీ అసోసియేషన్,జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. రాథోడ్ శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని పీకేఎల్, అంతర్జాతీయ వేదికలపై ఎదగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *