Telangana

చిట్కుల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

_ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ 

_దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహానీయుడి సొంతం

_నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారత దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని . సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సాంకేతిక విప్లవాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం విమానయానం టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ల ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ఆ రంగాన్ని ప్రోత్సహించాడని తెలిపారు. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన ఆ సంస్కరణలతోనే ప్రస్తుతం దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఆ మహనీయుడీ సొంతమన్నారు.భారత దేశ అభివృద్ధికి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణని ప్రపంచంలో అభివృద్ధి లో మేటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసి చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొట్టు అశోక్, వి నారాయణ రెడ్డి,గోపాల్,వెంకటేశ్,మురళీ, రాజ్ కుమార్,లత,శశికళ,కృష్ణ,శ్రీను, అనిల్, తదితరులు, పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago