మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రపురం:
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో శనివారం వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి తనయుడు మల్లేపల్లి రాహుల్ రెడ్డి, మాజీ టెలికామ్ బోర్డు సభ్యుడు దయాకర్ రెడ్డి, బొల్లారం శ్రీశైలం, గట్టుపల్లి మల్లేష్ పలు వినాయక మండపాలను సందర్శించారు. వివిధ మండపాల్లో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకులను అభినందించారు. 14వ, 21వ, 94వ, 96వ, 102వ బ్లాక్‌లతో పాటు మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బడా గణేష్‌ను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కేసీఆర్ నగర్ ఫేస్-02 బీఆర్ఎస్ నాయకులు, టీమ్ పవన్ పుత్ర సభ్యులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…