Telangana

ఆర్ .కే .వై . టీం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

సర్వం కోల్పోయి కూడు,గూడు, గుడ్డ లేక నిస్సహస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆర్ .కే .వై. టీం ముందుకు వచ్చిoదని ఆర్ కె వై టీమ్ సభ్యులు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ ఎం.ఎం .టి .ఎస్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకొని వారికి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేతులు మీదుగా దుప్పట్లు పంపిణీ చేయించడం జరిగిందని, ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేయనున్నట్లు వారు తెలిపారు. సేవాకార్యక్రమాలు చేపడుతున్న టీమ్ సభ్యులను రవికుమార్ యాదవ్ అభినందించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇలాంటి నిరు పేదలు ఎంతో మంది నివసిస్తున్నారని వారందరికీ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించినట్లయితే మీరంతా ఇలా రోడ్లపై నివసించే పరిస్థితి ఉండదని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఎల్లేష్.గణేష్ ముదిరాజ్.సోమయ్య.అకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, రాము, .మధు,.సంతోష్, క్రాంతి, .చంద్ర మసి రెడ్డి. పాపయ్య, దుర్గేష్ తదితరులు  పాల్గొన్నారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago