politics

ఆశ్రయ్‌ ఆకృతికి మద్దతు అందించిన నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌సీసీ) తమ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 5.5 లక్షల రూపాయలను ఆశ్రయ్‌ అకృతికి అందించిందని. ఆశ్రయ్ ఆకృతి ప్రతినిధులు తెలిపారు. తద్వారా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ సహకారంతో నిరుపేద మహిళల అభ్యున్నతికి ఈ నిధులు తోడ్పడనున్నాయి. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ అదనంగా 1.5 లక్షల రూపాయలను అందించింది. తద్వారా మొత్తం 7 లక్షల రూపాయలను ఆశ్రయ్‌ ఆకృతికి అందించినట్లయింది. ఈ నిధులను వినికిడి లోపం కలిగిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన పర్యావరణ వ్యవస్ధను సృష్టించడానికి వినియోగిస్తారు. ఈ చెక్‌ను (పీజెఎస్‌సీ దుబాయ్‌) బిజినెస్ హెడ్ సీఎఫ్ ఓ ఎమ్మార్ ప్రాపర్టీస్ మధుసూదన్ రావు ఆశ్రయ్‌ ఆకృతి ప్రతినిధులకు అందజేశారు. నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ మాతృసంస్ధ సైబరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమాజానికి సానుకూలంగా మద్దతు అందించడానికి కట్టుబడి ఉందని, మరీ ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రానికి మద్దతు అందిస్తుందన్నారు.

ఈ ప్రాజెక్ట్‌ ను ఆశ్రయ్‌ –ఆకృతి చేపట్టింది. వినికిడి లోపం కలిగిన పిల్లల అభ్యున్నతికి ఇది తోడ్పడుతుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారమందిస్తూ ఆశ్రమ్‌ అకృతి వారికి సంజ్ఞభాష వ్యాఖ్యాతలుగా పనిచేసేలా శిక్షణ అందిస్తుంది. దివ్యాంగులకు ఇది తోడ్పాటు అందించడంతో పాటుగా ఉద్యోగార్హత నైపుణ్యాలను స్త్రీలకు అందిస్తుంది. వినికిడి సమస్యలు కలిగిన ప్రజలకు కమ్యూనికేషన్‌ అంతరాలను ఇది తీర్చనుందని తెలిపారు. నొవొటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ , మన సమాజాభివృద్ధికి తోడ్పడటానికి కట్టుబడి ఉండటంతో పాటుగా నిరుపేద మహిళలకు మద్దతు అందిస్తుంది. లయన్స్‌ క్లబ్‌ హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ తో చేతులు కలిపి అశ్రయ్‌ ఆకృతి కి మద్దతు అందిస్తుంది. దీనిలో భాగా సైన్‌ లాంగ్వేజ్‌, టెక్నాలజీ వినియోగించి మహిళా సాధికారితకు మద్దతు అందిస్తుంది . తమ ఉద్యోగులు, అతిథులు, భాగస్వాములను సమాజానికి చురుకైన సహకారం అందించేలా ప్రోత్సహించడం ద్వారా స్ధిరమైన అభివృద్ధిపై అవగాహన కల్పించడం సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago