Telangana

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు

అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం

ప్రజల దాహార్తి తీర్చిన తర్వాతే పరిశ్రమలకు నీటి సరఫరా

మూడు నెలలకు ఒకసారి సైతం మంచినీరు రావడం లేదు

అధికారులు తీరు మార్చుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు

గ్రామీణ నీటిపారుదల అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి రోజు స్వచ్ఛ జలాలు అందించాల్సిన గ్రామీణ నీటిపారుదల విభాగం అధికారులు నీటి పంపిణీ అంశంలో ఘోరంగా విఫలం అవుతున్నారని.. ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాలకు మూడు నెలలకు ఒకసారి మంచినీరు సరఫరా అవుతున్నాయని ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూ ఎస్) అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం, లకడారం, ఇస్నాపూర్, పాశమైలారం, క్యాసారం, చిట్కుల్, తెల్లాపూర్ పరిధిలోని పోచారం, ఇంద్రేశం పరిధిలోని బచ్చుగూడ, ఇంద్రేశం, రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్, వడకపల్లి, దాయర తదితర గ్రామాలకు గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు సక్రమంగా మంచినీరు పంపిణీ కావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మనిషి జీవనానికి అత్యంత కీలకమైన తాగునీటిని అందించడంలో విఫలమైతే ప్రజలు నమ్ముకుని ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు.

సింగూరు, కాలేశ్వరం రిజర్వాయర్లలో మంచినీటి నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ పంపిణీ అంశంలో ఎందుకు విఫలమైతున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇదే అంశంపై గతంలోనూ సమీక్ష సమావేశాలు నిర్వహించిన మార్పు రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు గ్రామాలకు మూడు నెలలకు ఒకసారి మంచి నీరు విడుదల అవుతున్నాయని , ప్రజలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. పాశమైలారం పారిశ్రామిక వాడకు మాత్రం నిరాటంకంగా మంచినీరు సరఫరా అవుతున్నాయని. ప్రజలకు వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమకు నీళ్లు అందించడానికి తాము వ్యతిరేకించడం లేదని  ప్రథమ ప్రాధాన్యతగా ప్రజలకు అందించిన తర్వాతనే మిగతా విభాగాలకు అందించాలని ఆయన అధికారులకు సూచించారు.

మంచినీటి పంపిణీ అంశంపై నిత్యం గ్రామీణ ప్రాంతాలు, కాలనీల ప్రజల నుండి వందలాది ఫిర్యాదులు తమకు అందుతున్నాయని.. ఇదే పరిస్థితులు కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖాళీ బిందెలతో రహదారుల ఇబ్బందించే పరిస్థితులు తలెత్తకుండా తక్షణమే పంపిణీ అంశంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తనను నేరుగా సంప్రదించాలని. ప్రభుత్వంతోపాటు సిఎస్ఆర్ నిధులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే జిఎంఆర్ అధికారులకు సూచించారు.

రాబోయే వారం రోజులలో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి.. ప్రతి గ్రామానికి నిర్దేశించిన విధంగా మంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago