జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి : నీలం మధు ముదిరాజ్

politics Telangana

ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేని కలిసిన నీలం

హామ్ తుమారే సాత్ హై మధు అంటూ నీలంను ప్రోత్సహించిన ఖర్గే

ఖర్గేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నీలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కలిపించాలని ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేని కలిసి విన్నవించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్  సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా (కలబురగి) పరిధిలోని బుద్ధ విహార్ ట్రస్ట్ లో ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం తెలంగాణ లో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని, మరియు వివిధ అంశాలపై చాలా సేపు ఆయనతో చర్చించారు, ఈ సందర్భంగా చర్చించిన అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన ఖర్గే, హామ్ తుమారే సాత్ హై మధు అని నీలం మధును ప్రోత్సహించారు, అలాగే ఖర్గేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నీలం, ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *