అమీన్పూర్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో పండు టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజన్ 8 రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాలుగా అమీన్పూర్ వేదికగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. స్వతహాగా క్రీడలు అంటే తనకు ఇష్టమని, కబడ్డీ అంటే అమిత ఆసక్తి అన్నారు. నియోజకవర్గ పరిధిలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కబడ్డీ పోటీలకు రెండు లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో 60 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ దేవానంద్, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, కబడ్డీ సంఘం ప్రతినిధి ఎల్లయ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…