Telangana

ఫోటోగ్రాఫర్లు చరిత్రను, జ్ఞాపకాలను భద్రపరిచే కళాకారులు: నీలం మధు ముదిరాజ్

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ఫొటోగ్రాఫర్ల దినోత్సవం

జెండా ఎగురవేసి, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నీలం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఒక ఫోటో అనేది కేవలం ఒక చిత్రం కాదని, అది ఒక కాలానికి, ఒక సంఘటనకు, ఒక జ్ఞాపకానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని అ ఫోటో మన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యతను ఫోటోగ్రాఫర్లు నిర్వర్తిస్తున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యాలయంలో వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమం, ప్రజా ఉద్యమం, సామాజిక పరిణామం, కుటుంబ వేడుకలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని నీలం మధు అన్నారు. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నాటి జ్ఞాపకాలను కళ్లముందు నిలిపేది ఫోటోగ్రఫీ అని పేర్కొన్నారు. అందుకే ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకుని సేవలందిస్తున్న వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలో తాను చేయించిన హెల్త్ ఇన్సూరెన్సు కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, వారి వృత్తిపరమైన అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాజేశ్వర్, ఇస్నాపూర్ ప్రెసిడెంట్ నరేందర్, శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సందీప్, కౌన్సిలర్స్ సంఘన్నగారి గోపాల్, దస్తగిరి,లక్ష్మా రెడ్డి, మురళి, కృష్ణ యాదవ్,శంకర్, పవన్,రవి, రాజేష్, మోనాలిసా ఫొటోస్టూడియో ఆశోక్ , ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago