భారత స్వాతంత్య్రోద్యమం, అలాగే హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్‌రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామం(హైదరాబాద్)లో ఆగస్టు 13 నుంచి 17 వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి ప్రముఖుల కృషిని ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు.
ఈ ఎగ్జిబిషన్‌లో కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల పాత్రను ఈ ఫోటోలు ప్రస్తుత తరానికి క్లుప్తంగా వివరిస్తాయి. మాదాపూర్ శిల్పారామం సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్లో 30 ఫోటోలతో పాటు ఒక ఫోటో బూత్, సిగ్నేచర్ బోర్డులను కూడా సందర్శనకు ఉంచారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన ప్రచురణల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేసింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…