Telangana

గీతంలో పీహెచ్.డీ. ప్రవేశాలు

ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, హ్యుమానిటీస్, లాలో ఫుల్-టైమ్ కోర్సులు

పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తల కోసం ఎక్స్ ట్రామ్యూరల్ పీహెచ్.డీ. ప్రోగ్రామ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నంలో నెలకొని ఉన్న మూడు ప్రాంగణా లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్.డీ. ప్రోగ్రామ్ లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందని పరిశోధన, అభివృద్ధి డైరెక్టర్ ప్రొఫెసర్ రామగోపాల్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, న్యాయశాస్త్రం (లా) వంటి విభిన్న విభాగాలలో ఫుల్-టైమ్ అభ్యర్థులకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తల కోసం రూపొందించిన ఎక్స్ ట్రామ్యూరల్ పీహెచ్.డీ. ప్రోగ్రామ్ – ఇంజనీరింగ్, సైన్స్, ఫార్మసీ విభాగాలలో అందుబాటులో ఉందని ఆయన తెలియజేశారు.సంబంధిత మాస్టర్స్ డిగ్రీ (కనీసం 55 శాతం మార్కులు), కనీసం 75 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా ఎం.ఫిల్. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులని ప్రొఫెసర్ రామగోపాల్ పేర్కొన్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న చివరి ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.గీతం రీసెర్చ్ అడ్మిషన్స్ టెస్ట్ (GReAT), దాని తరువాత జరిగే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. UGC-NET, CSIR-NET, GATE, GPAT, ICAR, or DBT-JRF వంటి చెల్లుబాటయ్యే జాతీయ స్థాయి పరీక్ష స్కోర్లు ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుందని, వారిని నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తామని ఆయన వివరించారు.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 11, 2026 అని ప్రొఫెసర్ రామగోపాల్ స్పష్టీకరించారు. ప్రవేశ పరీక్షలు మే 23న (ఆన్ లైన్ లో), మే 30న (ప్రత్యక్షంగా) జరుగుతాయని, ప్రోగ్రామ్ ఆగస్టు 24, 2026న ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.అర్హత కలిగిన ఫుల్-టైమ్ పీహెచ్.డీ. పరిశోధకులకు మూడు సంవత్సరాల వరకు నెలకు రూ.33 వేల ఫెలోషిప్ తో పాటు, అధునాతన పరిశోధనా సౌకర్యాలు, సహకారాలు, అకడమిక్ మద్దతును గీతం అందిస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గీతం అధికారిక పోర్టల్ https://researchadmissions.gitam.edu లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. ఇతర వివరాల కోసం 0891-2866411 ను సంప్రదించాలని, లేదా phdsupport@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలన్నారు.

admin

Recent Posts

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ గా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ మాజీద్ అలీ

-రాష్ట్రస్థాయి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అవగాహన సదస్సు రవీంద్ర భారతిలో నిర్వాహణ -ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా…

7 hours ago

నేడు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బేతాళ స్వామి జాతరలో. అంబలి, అన్నదానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…

2 days ago

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

3 days ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

3 days ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

3 days ago