Telangana

అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

మనవార్తలు ,హైదరాబాద్:

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బవసపున్నయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 35 ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘డిమాండ్స్ డే’ను చేపట్టినట్టు వివరించారు. డిమాండ్స్ డే రోజున ఇండ్లస్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు, టోల్ గేట్ సమస్యలు, జర్నలిస్టు బంధు, రైల్వేపాసులపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని జర్నలిస్టులకు సూచించారు.

కలెక్టరేట్ల ముందు శాంతియుత ప్రదర్శనలు చేయాలని కోరారు. బ్యానర్లు, ప్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని డిమాండ్స్ డేను నిర్వహించాలని ఫెడరేషన్ శ్రేణులకు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విస్తృతంగా పాల్గొనాలని కోరారు . అలాగే జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75 శాతం రాయితీ సరిగ్గా అమలుకావడం లేదని చెప్పారు. డీజిల్ సెస్, టోల్ గేట్ల ఫీజులతో రాయితీ కేవలం 50 శాతం మాత్రమే అమలవుతున్నదని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, రాయితీని పూర్తిగా అమలుచేస్తూనే బస్సుపాసు సౌకర్యాన్ని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని కోరారు.

పేదలైన జర్నలిస్టులను ఆదుకునేందుకు ‘జర్నలిస్టు బంధు’ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా కాలంలో ఎత్తేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలనీ, రాయితీని వంద శాతానికి పెంచాలని కోరారు. ఈ సౌకర్యాన్ని కూడా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ జిల్లా కలెక్టర్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ లేఖలు రాసి రైల్వే పాసులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago